రేపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఇక రేపటితో డార్లింగ్ ప్రభాస్ కు 43ఏళ్లు నిండనున్నాయి. అయితే ఈసారి పుట్టిన రోజు చేసుకోవడం లేదని ప్రభాస్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్ డేను తమదైన శైలిలో ట్రెండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఫ్యాన్స్ ను ఖుషీ చేసేలా ప్రభాస్ తో సెట్స్ పై ఉన్న దర్శకులు క్రేజీ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.ఈమేరకు వైజయంతి బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న 'ప్రాజెక్టు కే' నుంచి ఓ స్పెషల్ అప్డేట్ ఉంటుందని ప్రకటించింది. ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా దీపిక పదుకోన్ నటిస్తోంది. కీలక పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. దీంతో 'ప్రాజెక్ట్ కే' నుంచి ఎలాంటి అప్డేట్ ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది."ఆదిపురుష్" టీం కూడా ప్రభాస్ పుట్టిన రోజున ఓ సర్ ప్రైజ్ ఇవ్వనుందని తెలుస్తోంది.


ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. కాగా ఇటీవల 'ఆదిపురుష్' నుంచి విడుదలైన టీజర్ పై మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఈ స్పెషల్ పోస్టర్ ద్వారా ఫ్యాన్స్ ను అలరించాలని నిర్మాతలు భావిస్తున్నారు.దర్శకుడు ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో 'సలార్' మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి చాలారోజులుగా ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 'సలార్ ' నుంచి కూడా ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.దర్శకుడు మారుతి కూడా ప్రభాస్ తో చేయబోయే తన సినిమా గురించి అప్డేట్ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఇలా రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులను ఫిదా చేసేందుకు ఇలా వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది అభిమానులకు పండుగ రోజే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: