ప్రభాస్ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్‌ మూవీ 'ఆదిపురుష్' .రీసెంట్ గా విడుదలైన టీజర్‌ కు విమర్శలు ఉన్నా,ట్రోలింగ్ జరిగినా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేసారు.ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ఈ టీమ్ ఈ పోస్టర్ రిలీజ్ చేసింది. మీరు ఇక్కడ ఆ పోస్టర్స్ ని చూడవచ్చు.భారతీయ పురాణాలలో ప్రపంచం అమితంగా ఇష్టపడే ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో టి - సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్ట్రైట్ మూవీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన రాముడిగా నటిస్తున్నారు. ప్రభాస్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓంరౌత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.

మరిన్ని విశేషాలు ఏమిటంటే... ఈ సినిమాలో ప్రభాస్ ...ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటారు. అలాగే సైఫ్ అలీ కాన్ ..ఏడు అడుగులు ఉంటారు. విఎఫ్ ఎక్స్ తో ఈ సైజ్ ని పెంచి మ్యానేజ్ చేస్తున్నారు. ఇక వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు ఎనిమిది అడుగులు ఆజానుబాహువు, అరవింద నేత్రుడు అని..అవన్ని ఈ రాముడులో కనపడతాయని అంటున్నారు. బాహుబలికు పది రెట్లు వి ఎఫ్ ఎక్స్ వాడుతున్నట్లు సమాచారం. మరో ప్రక్క 3డిలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.

రామాయణం ప్రభావం తనపై ఎంతగానో ఉందని ఓం రౌత్ చెప్పాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువవుతుందన్నాడు. ఈ చిత్రంలో రాముని వైభవం, శోభ, పరాక్రమాన్ని చూపిస్తానన్నాడు. ప్రభాస్, సైఫ్ అలీఖాన్‌లతో పనిచేయడం అద్భుతంగా ఉందన్నాడు. ''ప్రభాస్ చాలామంచి వ్యక్తి. షూటింగ్‌కు ఎప్పుడూ ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి అందరికీ రుచి చూపించేవాడు. రామునిగా కనిపించాలి కాబట్టి శరీరాన్ని ఫిట్‌గా ఉంచమని ప్రభాస్‌కు చెప్పాను. నేను చెప్పిన వెంటనే జిమ్ చేయడం ప్రారంభించాడు'' అని ఓం రౌత్ స్పష్టం చేశాడు.

'బాహుబలి' సినిమాతో ఆశేషంగా అభిమానులను సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ప్రేక్షకులను అలరించి.. పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం అతడి చేతిలో 'సలార్', 'ఆది పురుష్', 'ప్రాజెక్ట్-కే', 'స్పిరిట్' వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. 'ఆదిపురుష్'ను రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: