సాధారణంగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లకు టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అని చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి అదృష్టం కలిసి వచ్చిన లక్కీ బ్యూటీ కృతి శెట్టి అని చెప్పాలి. ఉప్పెన అనే సినిమాతో మెగా హీరోతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి... ఇక ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక తన అందం అభినయంతో ఈ అమ్ముడు ఎంతో మంది కుర్ర కారు మతి పోగొట్టింది అని చెప్పాలి. అయితే హీరోయిన్గా పర్ఫెక్ట్ మెటీరియల్ అని అనిపించుకున్న కృతి శెట్టి వాస్తవానికి చిన్ననాటి నుంచి హీరోయిన్ అవ్వాలి అనుకోలేదట.


 ముంబైలో చదువును కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ చదువుకుంటున్న సమయంలోనే ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో కనిపించిందట. ఇక దాని ద్వారా ఆమెకు హిందీలో నటించే అవకాశం దక్కింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ 30 సినిమాలో కీలకమైన స్టూడెంట్ పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత తెలుగులో బేబమ్మగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా హిట్ కావడంతో వరుస  అవకాశాలు వచ్చాయి. దీంతో ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఇక ఆ తర్వాత శ్యాం సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది.


 అయితే కృతి శెట్టి హీరోయిన్ గా ఎదగడానికి ఆమె కుటుంబం ఎంతగానో త్యాగం చేసిందట. 2003లో ముంబైలో పుట్టిన కృతిశెట్టి తుళు ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి. వీరు కర్ణాటకలోని మంగుళూరు వాస్తవ్యులు కావడం గమనార్హం. అయితే తండ్రి వ్యాపారం దృశ్య ఇక ముంబాయికి వచ్చి సెటిల్ అయిపోయాడు. కృతి శెట్టి తల్లి ఫ్యాషన్ డిజైనర్. ఈమెకు ఒక తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు. కాగా కృతి శెట్టి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసిందట. అయితే కృతి శెట్టికి వరుసగా హీరోయిన్గా అవకాశాలు రావడంతో ఇక తన బిజినెస్ అయినా ఫ్యాషన్ డిజైనర్ ప్రొఫెషన్ను వదిలేసి కృతి శెట్టి ఎక్కడికి వెళ్లిన తనతో పాటే వెళ్లి ఒక గార్డియన్గా వ్యవహరించిందట ఆమె తల్లి. ఇలా తన కెరియర్ పణంగా పెట్టి ఏకంగా కూతురి కెరీర్ కోసం పెద్ద త్యాగం చేసింది కృతి శెట్టి తల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: