ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 చిత్రాలు జపాన్లో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో కట్టప్ప ఫార్ములా అక్కడ బాగా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. ప్రభాస్ నటనకు మంత్రముగ్ధులు అయిపోయారు. దీంతో అక్కడ అసాధారణమైన వసూళ్లను రాబట్టింది. ఇక రాజమౌళికి కూడా అక్కడ మంచి ఫ్యాన్ పాడాయి ఏర్పడింది. అదే అదునుగా ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన rrr సినిమా జపాన్ భాషలో విడుదలైంది ఈ సినిమా విడుదల నుంచి ప్రచారం కోసం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ బృందం అందరూ కలిసి జపాన్ లో ప్రచారం చేస్తూ ఉన్నారు.


ఇక అక్కడ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఫలితం ప్రకారం ఆశించిన స్థాయిలో ఉందా లేదా అంటే రెండో రోజు నుంచి కాస్త కలెక్షన్లు డ్రాప్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో కొంతమేరకు నిరాశను కలిగిస్తోంది ఈ చిత్రం అన్నట్లుగా సమాచారం .తొలి వీకెండ్ కేవలం నాలుగు కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకి మంచి హైప్ ఉన్నప్పటికీ ఆదాయాన్ని మాత్రం ఆకర్షించే విధంగా లేదని చెప్పవచ్చు. ఇక రాజమౌళి యాక్షన్ భారత దేశంలో అంతర్జాతీయ వారి విజయాన్ని సాధించాయి.


వాస్తవానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రపంచ సినీ ప్రేక్షకులకు సైతం ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది ఇందులో ఆలియా భట్, అజయ్ దేవగన్ అతిధి పాత్రలో నటించి ఈ సినిమాకి మరింత ఆకర్షణీయంగా నిలిచారు. ఇక వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో భారతదేశం నుంచి అధికారికంగా ఈ చిత్రం నామినేట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే జపాన్లో భారీగా విడుదలైన ఈ చిత్రం ఒకటవ రోజు అద్భుతమైన స్పందన వచ్చింది కానీ ఆ తర్వాత ప్రజలు ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి థియేటర్ వద్దకు రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: