కన్నడ చిత్రం  కాంతార చిత్రం చూసిన ప్రముఖులు, సామాన్యులు అద్భుతం అంటూ  హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్  కూడా చేరారు. కాంతార చిత్రంపై ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఆయన ట్వీట్  ఒక చేశారు మరీ,
రజినీకాంత్ తన ట్వీట్ లో... తెలిసింది గోరంత తెలియంది కొండంత. ఈ విషయాన్ని హోమ్బలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన కాంతార చిత్రంలో చెప్పినంత గొప్పగా మరొకరు చెప్పలేరేమో మరీ, ఈ సినిమా నా రోమాలు నిక్కబొడిచేలా చేసింది. నటుడు, రచయిత, దర్శకుడు బాధ్యతలు నెరవేర్చిన రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. అంటూ రజినీ పేర్కొన్నారు,ఇలాంటి మాస్టర్ పీస్ ఇండియన్ సినిమాకు అందించిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అంటూ కామెంట్  కూడాచేశారు.

కాంతార మూవీని మాస్టర్ పీస్ గా అభివర్ణించిన రజినీకాంత్... అద్భుత చిత్రాన్ని చూశానన్న భావన వెలిబుచ్చారు. ఇక రజినీకాంత్ ట్వీట్ కి హీరో రిషబ్ శెట్టి స్పందించారు. లెజెండరీ సూపర్ స్టార్ అయిన మీరు నా చిత్రాన్ని పొగడటంతో నా కల నెరవేరింది. చిన్నప్పటి నుండి నేను మీ అభిమానిని. మీ ప్రశంసలు మరిన్ని స్థానిక కథలు తెరపైకి తీసుకురావడానికి స్ఫూర్తిని ఇచ్చింది అంటూ... రిట్వీట్ కూడా చేశారు.

కాంతార తమిళంలో కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో రజినీకాంత్ ట్వీట్ చిత్రానికి మరింత ప్రచారం తెచ్చిపెడుతుంది అంటా మరీ,వరల్డ్ వైడ్ కాంతార రూ. 200 కోట్ల వసూళ్లు  ఎప్పుడో దాటేసింది. ఇక తెలుగులో సంచలనాలు నమోదు చేస్తుంది. కాంతార తెలుగు రాష్ట్రాల్లో 11 రోజులకు సుమారు రూ.16 కోట్ల షేర్, రూ. 29 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నిర్మాత అల్లు అరవింద్ కాంతార తెలుగు హక్కులు కేవలం రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ లెక్కన కాంతార ఆయనకు ఎంత మొత్తంలో లాభాలు తెచ్చిందో   మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాంతార వసూళ్లు బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: