తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు బ్రహ్మాజీ . ఒకప్పుడు హీరోగా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఇక క్యారెక్టర్ నటిస్తూ విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.  ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు బ్రహ్మాజీ. అయితే ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ అటు బ్రహ్మాజీ మాత్రం తనదైన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు.


 ఇక మొన్నటి వరకు సినిమాల్లో పెద్దగా కనిపించని బ్రహ్మాజీ  ఇటీవల కాలంలో మాత్రం ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తూ మళ్ళీ కడుపుబ్బ నవ్వించడం మొదలుపెట్టాడు. అయితే సినిమాల్లోనే కాదు ఇక నిజ జీవితంలో కూడా బ్రహ్మాజీ ఎంతో సరదాగా ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా సరదాగా మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల ఏకంగా  రెబల్ స్టార్ ప్రభాస్ ఒక డైలాగ్ ని స్పూఫ్ చేసి అందరిని పొట్ట చెక్కలయ్యేలా  నవ్వించాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.


 ప్రభాస్ నటించిన ఆది పురుష్ టీజర్ విడుదలైన సమయంలో డైరెక్టర్ ఓం రౌత్ ను ప్రభాస్ కం టు  మై రూమ్ పిలిచిన డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది. ఇక ఇటీవల బ్రహ్మాజీ కూడా ఇదే డైలాగ్ తో నవ్వులు పూయించాడు అని చెప్పాలి. ప్రస్తుతం శోభన్, ఫరియా నటించిన లైక్ షేర్ సబ్స్క్రయిబ్ అనే సినిమాలో నటించాడు బ్రహ్మాజీ. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం క్యాష్ షో కి గెస్ట్లుగా వచ్చారు. ఈ క్రమంలోనే సుమ ఎలాంటి ప్రశ్నలు అడిగిన.. పక్కనున్నవారు తనపై ఎలాంటి కౌంటర్ వేసిన. కూడా సీరియస్ గా కం టు మై రూమ్ అంటూ డైలాగ్ చెప్పాడు.. ఇలా తరచూ బ్రహ్మాజీ కం టు మై రూమ్ అనడంతో అక్కడున్న వారందరూ కూడా తెగ నవ్వుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: