కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన కార్తి తాజాగా సర్దార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న పీ ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా ,  రాసి కన్నామూవీ లో కార్తీ సరసన హీరోయిన్ గా నటించింది. సర్దార్ మూవీ అక్టోబర్ 21 వ తేదీన దీపావళి సందర్భంగా చాలా ఘనంగా తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. అలాగే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. మరి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

సర్దార్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 95 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. సర్దార్ మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మూడవ రోజు సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.48 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 64 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 44 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ మూవీ 5.88 కోట్ల షేర్ , 9.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: