సాధారణంగా ఈటీవీలో పనిచేసే కమెడియన్లు వేరే ఇతర ఛానల్లో ఎక్కడ కనిపించరు. అయితే శ్రీముఖి సుమ వంటి పలువురు టాప్ యాంకర్లు మినహా మిగతా కమెడియన్స్ ఎక్కడా కూడా ఇతర ఛానల్లో కనిపించరు.
ఒకవేళ అలా కనిపించిన వాళ్లు పూర్తిగా ఈటీవీ కార్యక్రమాలకు దూరం అవుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో హైపర్ ఆదికి కాస్త మినహాయింపు ఉందని తెలుస్తోంది.హైపర్ ఆది ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నప్పటికీ ఈయన స్టార్ మా లో కూడా అప్పుడప్పుడు తలుక్కుమంటుంటారు. ఇక స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రతి సీజన్ లో కూడా హైపర్ ఆది సందడి చేస్తారు.

గత సీజన్లలో కూడా హైపర్ ఆది పెద్ద ఎత్తున బిగ్ బాస్ వేదికపై సందడి చేస్తూ కంటెస్టెంట్లతో ముచ్చటించిన విషయాలు మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆరవ సీజన్లో కూడా దీపావళి పండుగను పురస్కరించుకొని హైపర్ ఆది బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. అదేవిధంగా స్టార్ మా పరివార్ అవార్డులో కూడా హైపర్ ఆది సందడి చేశారు ఇకపోతే దీపావళి పండుగను పురస్కరించుకొని బిగ్ బాస్ వేదికపై హైపర్ ఆది సందడి చేయడంతో ఈ ఎపిసోడ్ కోసం హైపర్ ఆది ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇలా హైపర్ ఆది బిగ్ బాస్ వేదికపై సందడి చేసినందుకుగాను ఈయనకు బిగ్ బాస్ నిర్వాహకులు 10 లక్షల వరకు రెమ్యూనరేషన్ చెల్లించినట్లు సమాచారం.కొంత సమయం మాత్రమే హైపర్ ఆది బిగ్ బాస్ వేదికపై సందడి చేయగా ఆయనకు పది లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అయితే బయట హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ నిర్వాహకులు ఆయనకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారని పలువురు భావిస్తున్నారు. అయితేఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: