ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమంది అప్కమింగ్ కమెడియన్స్ లైఫ్ లో వెలుగులు నింపింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీకి ఎలా రావాలో తెలియక అవకాశాల కోసం ఎదురుచూస్తూ పస్తులు ఉంటున్న ఎంతోమంది కమెడియన్స్ కడుపు నింపింది జబర్దస్త్. ఇక ఇండస్ట్రీలోకి రావడానికి ఒక బంగారు బాటను చూపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలా జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చి పాపులారిటీ సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకుని సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు.


 అలాంటి వారిలో ఈటీవీలో బాగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు అని చెప్పాలి. జబర్దస్త్ ద్వారా ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించిన సుడిగాలి సుదీర్ బుల్లితెరపై స్టార్ హీరో రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. తనకంటూ ప్రత్యేకమైన ఫాన్స్ ఆర్మీ ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తన జీవితానికి అసలైన రూపం ఇచ్చిన జబర్దస్త్ ను వదిలి బయటికి వెళ్లిపోయాడు. ఇక సుడిగాలి సుదీర్ వెళ్ళిపోవడంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.


 అయితే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుదీర్ వెళ్ళిపోయిన తర్వాత అటు షో రేటింగ్స్ ఒకసారి గా పడిపోయాయని.. కార్యక్రమాన్ని ఆపేసే పరిస్థితి వచ్చిందని వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎంతమంది కమెడియన్స్ జబర్దస్త్ ను వీడినప్పటికీ అటు షో మాత్రం నిర్విఘ్నంగానే ప్రసారమవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోయిన తర్వాత అటు జబర్దస్త్ షో కంటే సుధీర్ కే ఎక్కువ నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాటీవీలో షోస్ లేకపోవడంతో ఖాళీగానే ఉంటున్నాడు సుధీర్. ఇక ప్రేక్షకుల ఆదరణ లభించకపోవడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు నెలకు 20 రోజుల పాటు షూటింగ్లో బిజీగా ఉండే సుదీర్ ఇప్పుడు కనీసం వారం రోజులు కూడా షూటింగ్ లేక ఇబ్బందులు పడుతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: