భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30 వ తేదీన కన్నడ భాషలో విడుదల అయిన కాంతారా సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో కాంతారా మూవీ కన్నడ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అలా కన్నడ సినిమా ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కాంతారా మూవీ ని ఆ తర్వాత మరి కొన్ని భాషల్లో కూడా విడుదల చేశారు. అందులో భాగంగా అక్టోబర్ 15 వ తేదీన కాంతారా మూవీ ని తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశాడు. ఈ మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన టాక్ ని తెచ్చుకొని ,  ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. ఇలా అద్భుతమైన విజయం సాధించిన కాంతారా మూవీ నవంబర్ 4 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" లో స్ట్రీమింగ్ కానుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ వార్తలపై తాజాగా నిర్మాత కార్తీక్ గౌడ క్లారిటీ ఇచ్చాడు. నవంబర్ 4 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" లో కాంతారా మూవీ విడుదల కానుంది అంటూ వస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదు అని నిర్మాత కార్తీక్ గౌడ స్పష్టం చేశాడు. "ఓ టి టి" లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ముందుగానే ప్రకటిస్తాము అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఇది ఇలా ఉంటే కాంతారా  మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించగా ,  ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ప్రస్తుతం కాంతారా మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: