టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు తీసుకు వెళుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం నాగ చైతన్య తన కెరీర్ లో 22 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.నాగ చైతన్య  కెరీర్ లో 22 వ మూవీ గా తెరకేక్కుతున్న సినిమాకి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  ఈ మూవీ లో కృతి శెట్టి , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే నాగ చైతన్య మరియు కృతి శెట్టి కాంబినేషన్ లో బంగార్రాజు మూవీ తర్కెక్కింది. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఈ మూవీ కి ఇళయ రాజా ,  యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో ప్రియ మణి కూడా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ చైతన్య 22 వ మూవీ లో ప్రియ మణి పాత్రకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... నాగ చైతన్య ,  వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో ప్రియ మణి "సీ ఎం" పాత్రలో కనిపించబోతున్నట్లు ,  ఈ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవనునట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ,  వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకేక్కుతున్న మూవీ పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నాగ చైతన్య ప్రస్తుతం ఈ సినిమాతో పాటు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ తో నాగ చైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: