తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. దగ్గుపాటి రానా ఈ మూవీలో మరో హీరోగా నటించాడు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ నిధి అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. హరిహర వీరమల్లు మూవీ కి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ మూవీ మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది.  పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో హరిహర వీరమల్లు మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ ,  మధ్యలో కొన్ని  కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులపాటు ఆగిపోయింది.  తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ రోజు నుండి హరిహర వీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: