తమిళం, తెలుగు, హిందీ లో పాపులర్ హీరోగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరో సిద్ధార్థ్. సిద్ధార్థ్ కి యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ అయితే మాములుగా లేదు.ఇతను హీరో అయిన దగ్గర నుంచి చాలా మంది స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు. సమంత, శృతి హాసన్, హన్సికలతో అయితే ఒక రేంజ్ లో డేటింగ్ చేశాడని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి ఇతనితో డేటింగ్ చేస్తోందని ఇప్పటికే న్యూస్ వైరల్ అవుతుంది.  ఇప్పుడు అదితీతో ప్రేమాయణం చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.అదితీతో సిద్ధార్థ్ సహజీవనం గురించి ఇప్పటికే చెన్నై ముంబై వర్గాల్లో విపరీతమైన టాక్ ఉంది. ఆ ఇద్దరూ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారని కూడా గుసగుసలు వినిపించాయి.ఈ జంట షికార్లు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. తాజా సమాచారం మేరకు... అదితి ఇంకా సిద్ధార్థ్ చెన్నైలో అదితి 36వ పుట్టినరోజును సెలబ్రేట్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకల కోసం ఇద్దరు ఇప్పటికే ముంబై నుంచి చెన్నై వెళ్లిపోయారు.


అయితే ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని అంగీకరించలేదు లేదా తిరస్కరించలేదు.ప్రేమ పక్షులు అనేక సందర్భాల్లో కలిసి జంటగా కనిపించాయి. ముంబైలోను పలుమార్లు మీడియా కంటికి చిక్కినా తమ ప్రేమాయణం గురించి ఓపెనవ్వలేదు. సెప్టెంబరులో చెన్నైలో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఇద్దరూ కలిసి చివరిసారిగా హాజరయ్యారు.సిద్ధార్థ్ ఇంతకుముందు హాట్ స్టార్ వెబ్ సిరీస్ 'ఎస్కేప్ లైవ్'లో నటించాడు.తరువాత 'ఇండియన్ 2'... 'టక్కర్' చిత్రాల్లో కనిపించనున్నాడు. మరోవైపు అదితి చివరిగా 'హే సినీమిక' చిత్రంలో కనిపించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'జూబ్లీ'లో కూడా కనిపిస్తుంది. అదితీకి ఇది తొలి వెబ్ సిరీస్. ఇకపై రాబోయే కాలంలో భారీ సినిమాల్లో నటించేందుకు చర్చల్లో ఉందని సమాచారం.ఇక సిద్ధార్థ్ అదితిని నిజంగా పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: