కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో లలో  ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అజిత్ ఆఖరుగా వలిమై అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్  యువ హీరోలలో ఒకరు అయిన కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టినప్పటికీn,  ఇతర భాషలో మాత్రం భారీ విజయాన్ని అందుకో లేక పోయింది.

ఇది ఇలా ఉంటే వలిమై మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన అజిత్ ప్రస్తుతం తునివూ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే చాలా రోజులవుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: