దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ లేడనే విషయాన్నీ ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడుగా స్టార్డమ్ అందుకున్న పునీత్.. వ్యక్తిగతంగా గొప్ప మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకు ఫ్రీ స్కూల్స్ లాంటి ఎన్నో మంచి పనులు చేపట్టిన పునీత్ రాజ్ కుమార్.. గతేడాది ఇదే నెలలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో పునీత్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పునీత్ జ్ఞాపకార్థం 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు.గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఫైబర్‌ గ్లాస్‌ తో రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు. 21 అడుగుల ఎత్తులో ‘3డి’ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బెంగళూర్లో ప్రదర్శించనున్న ఈ విగ్రహ తయారీకి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం తెనాలిలోని స్థానిక సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా నిలిపారు. ఇటీవల ఈ విగ్రహాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆవిష్కరించి, కళాకారులను అభినందించారు.

ఇక బెంగళూరులో పునీత్‌ రాజ్‌ కుమార్‌ పేరు మీద తాళూరు రోడ్డులోని కురువల్లి ఎన్‌క్లీవ్‌ లో పార్కును నిర్మించారు. ఇదిలా ఉండగా.. కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ కి.. నవంబర్ 1న “కర్ణాటక రత్న’ బిరుదుతో సత్కరించనుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథులుగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. కన్నడ ఫ్యాన్స్ అంతా పునీత్ ని ముద్దుగా అప్పు అని పిలుస్తుంటారు. ఐదేళ్ల వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టిన పునీత్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం పునీత్ కి సంబంధించి ఫైబర్ విగ్రహం పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: