పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు' .'హరి హర వీర మల్లు' సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ నటిస్తున్నారు. మన భారత దేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా కోసం ఆ కాలం నాటి సెట్స్ వేశారు.'హరి హర వీర మల్లు' కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్క్ షాప్స్‌లో పాల్గొనడం జరిగింది. ఆ మధ్య స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ జరిగాయి. దానికి పవన్ అటెండ్ అయ్యారు. దాని కంటే ముందు కొన్ని రోజులు స్టంట్స్ ప్రాక్టీస్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తోదోర్ లాజరోవ్ నేతృత్వంలో పవన్ కల్యాణ్, ఇతర తారాగణంపై యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. మల్ల యోధుడు మల్లుగా పవన్ కనిపించనున్నారు. మొఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్  నటించనున్నట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఆయన్ను దర్శకుడు క్రిష్ కలిసి కథ, పాత్ర తీరుతెన్నులు వివరించారని... బాబీ డియోల్ వెంటనే అంగీకరించారని సమాచారం. నవంబర్‌లో అతి త్వరలో ఆయన షూటింగ్ చేయడానికి హైదరాబాద్ రానున్నారట.



కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్  కళ్యాణ్ ఆ షూటింగులో పాల్గొనే అవకాశం లేనట్లు కనిపిస్తుంది. దానికి కారణం పవన్  తన రాజకీయ పనుల్లో ఫుల్ బిజీగా ఉండటమే కారణం అని తెలుస్తుంది. రాజకీయ పనుల్లో ఫుల్  బిజీగా ఉండటం వల్లనే పవన్  కళ్యాణ్ హరి హర వీర మల్లు షూటింగులో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తుంది. మరి మిగతా తారాగణంతో షూటింగుని క్రిష్  పూర్తి చేసే ప్లానులో ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో..పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ మూవీకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. దగ్గుపాటి రానా ఈ మూవీలో మరో హీరోగా నటించాడు.ఇక హరి హర వీరమల్లుతో పవన్  కళ్యాణ్  ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: