సినిమాలు రాజకీయాలపై కూడా ప్రభావం చూపిస్తాయా అంటే ఇప్పట్లో అంతలా కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం సినిమా వాళ్ళే రాజకీయాల్లో కూడా హవా నడిపించారు. తెలుగులో ఎన్టీఆర్ దగ్గరనుంచి తమిళ్లో ఎంజీఆర్, జయలలిత వరకు అందరూ సినిమా నటులు ముఖ్యమంత్రిగా మారి ప్రజలను పాలన సాగించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తెలుగులో ఎవరికి సాధ్యం కాని రీతిలో నటసార్వభౌముడిగా ఎనలేని గుర్తింపును సంపాదించిన ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా అంతే విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు అని చెప్పాలి.


 ఆయన భౌతికంగా దూరమై ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమాల్లో ఎలా అయితే నటసార్వభౌముడిగా గుర్తింపు సంపాదించుకున్నారో.. రాజకీయాలలో కూడా ప్రజా నాయకుడిగా  పేరు ప్రఖ్యాతులు పొందారు ఎన్టీఆర్. రాజకీయం అంటే కేవలం కాంగ్రెస్ మాత్రమే అన్నట్లుగా కొనసాగుతున్న తెలుగు రాష్ట్రంలో సరికొత్త పార్టీని పెట్టి జాతీయ పార్టీకి షాక్ ఇచ్చి సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాదిగా నిలిచిన సినిమా మాత్రం ఒకటే అన్నది చాలామందికి తెలియదు.


 ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకున్న సమయంలో 1982 మార్చి 29 వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇక ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ప్రజల్లోకి వెళ్లడానికి ఆయనకు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. ఇలాంటి సమయంలో సినిమాలను దూరంగా పెట్టుకోవాలని అనుకున్నారు. కానీ కాల్ సీట్స్ ఇచ్చిన నిర్మాతలు మాత్రం ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో కేవలం 17 రోజుల్లోనే ఓ సినిమా షూటింగ్ పూర్తి చేశారు ఎన్టీఆర్. బాలీవుడ్లో అమితాబ్ నటించిన లావారీస్ సినిమాను తెలుగులో రైట్స్ కొనుగోలు చేసి నాదేశం అనే సినిమాను చేశారు. కే బాపయ్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 17 రోజుల్లో పూర్తయింది. 40 లక్షల బడ్జెట్ తో తెరకెక్కి కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. ఈ సినిమా విడుదల 70 రోజులకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: