కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. చోళుల సామ్రాజ్యం నాటి కథకు కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మణిరత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.ఐశ్వర్యరాయ్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ, శోభిత ధూళిపాళ్ల వంటి నటులు ఈ చిత్రంలో నటించారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో మాత్రం ఇండస్ట్రీ హిట్ నిలిచింది. అయితే ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా అమెజాన్ ప్రైమ్ లో నిన్నటి నుంచి స్ట్రీమ్ అవుతున్నది.ఎందుకు ఇలా

పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ నిన్నటి నుంచి స్ట్రీమ్ చేస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రమోషన్ కానీ యాడ్స్ కానీ కనిపించలేదు. ఆకస్మాత్తుగా అమెజాన్ ప్రైమ్ యాప్ లో ఈ మూవీ లింక్ చూసి మెంబర్షిప్ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు. కాకపోతే వారం రోజులపాటు ₹199 రూపాయల అద్దె కడితే తప్పా చూడలేని ఆప్షన్ ఇవ్వడంతో ఖంగు తినడం సబ్ స్క్రైబర్ ల వంతయింది.. ఒకవేళ చందా దారులు ఫ్రీగా చూడాలి అనుకుంటే నవంబర్ 4 దాకా ఎదురు చూడాలి. పొన్నియన్ సెల్వన్ విడుదలయి ఇవ్వాళ్టి కి 31 రోజులు అయింది. ఇప్పటికీ విజయవంతంగా తమిళనాడులో ప్రదర్శితమవుతూనే ఉంది.

కారణాలు ఏమిటంటే

పొన్నియన్ సెల్వన్ విడుదలకు ముందు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నిర్మాతలు నెల రోజులకు మించి సినిమా రన్ కాదని భావించారు. ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే అంతకి మించి ఆడే పరిస్థితులు లేవు. అందుకే 30 రోజుల డీల్ కు ఒకే చెప్పేసి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అమెజాన్ నుంచి ఫ్యాన్సీ ఆఫర్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాము పెట్టిన పెట్టుబడికి ఎక్కువ రికవరీ రాబట్టుకోవాలని ఉద్దేశంతో అమెజాన్ ప్రైమ్ ఇలా డబ్బులు కట్టి చూడండి అనే ఆఫర్ ను తెరపైకి తీసుకొచ్చింది. గతంలోకేజిఎఫ్ 2, సర్కారు వారి పాట సినిమాలకు ఇలాంటి పద్ధతినే అమెజాన్ ప్రైమ్ తీసుకువచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినప్పటికీ అమెజాన్ ప్రైమ్ వెనకడుగు వేయలేదు400 కోట్లు రాబట్టింది

తమిళ వెర్షన్ నుంచి 400 కోట్లను పొన్నియన్ సెల్వన్ రాబట్టింది. తెలుగులో మాత్రం పది కోట్ల బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి నానా ఇబ్బందులు పడింది. చోళుల నేటివిటీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈ సినిమా సీక్వెల్ మీద కూడా పెద్దగా బజ్ లేదు. రాజమౌళి తీసిన బాహుబలి స్థాయిలో యునానిమస్ టాక్ వస్తుంది అని అక్కడి మీడియా అంచనా వేసింది. అది జరగకపోవడంతో విడుదలైన మొదటి వారం మన ప్రేక్షకుల అభిరుచిని తమిళ ప్రజలు ట్రోల్ చేశారు. ఆ తర్వాత కాంతారాను బ్లాక్ బస్టర్ చేసి తమిళ ప్రజల నోరు తెలుగు ప్రేక్షకులు మూయించారు. ఈ వారం పెద్దగా చెప్పుకోదగిన సినిమాల విడుదల లేకపోవడంతో పొన్నియన్ సెల్వన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యేందుకు మరో కారణంగా తెలుస్తోంది. అయితే ముందస్తు ఒప్పందం ప్రకారం స్ట్రీమ్ అవుతున్న నేపథ్యంలో.. రెండో భాగానికి కూడా అమెజాన్ ఫాన్సీ రేటు ఆఫర్ చేసినట్టు సమాచారం. మరి దీనిపై మణిరత్నం ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: