పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే వేసవికి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని ఇటీవలే తిరిగి మొదలుపెట్టగా ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జోరుగా జరుగుతుంది. ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో నటుడిగా మంచి పేరు ఫేమ్ సంపాదించుకున్న అర్జున్ రామ్ పాల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా తాజాగా మరో బాలీవుడ్ నటుడిని కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేయబోతున్నారని తెలుస్తుంది.

 బాలీవుడ్ లో హీరోగా నటుడిగా అన్ని రకాల పాత్రలు పోషించి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపిక అయ్యారు అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అంతటి మంచి నటుడు ఈ సినిమాలో నటించడం మంచి విషయమే అయినప్పటికీ తెలుగు నటులను పక్కనపెట్టి ఈ విధంగా ఇతర భాషల నటులను తీసుకురావడం కొంతమందికి నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి

 ఇకపోతే ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతూ ఉండడంతో పవన్ కళ్యాణ్ కు కూడా ఎలక్షన్లు దగ్గరికి రావడంతో వీలైనంత త్వరగా సినిమా యొక్క షూటింగ్ ను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాక్వేలిన్ ఫెర్నాండెజ్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉండగా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ స్థాయిలోనే అంచనాలను పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ లాంటి పెద్ద విజయం తర్వాత రాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: