అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో. అల్లు వారి చిన్న తనయుడుగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన శిరీష్ చాలా రోజుల తర్వాత ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాను చేయడం విశేషం. అంతకుముందు ఆయన ఓ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి చాలా రోజులే అయిపోయిందని చెప్పాలి. కారణం ఏదైనా కూడా ఇప్పుడు ఒక మంచి కథతో కథనం ఉన్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ సినిమాలో రొమాన్స్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా థియేటర్లకు రప్పించడానికి దోహదపడుతుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ లో ఈ సినిమాలో ఏ పాటి రొమాన్స్ ఉంటుందో కనబడుతుంది. తొలిసారిగా రొమాంటిక్ సినిమాలో నటిస్తున్న అల్లు శిరీష్ ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలలో రెచ్చిపోయాడు అని టీజర్ ను బట్టి చెప్పవచ్చు. ఇక అందాల ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ కి కూడా యువతలో మంచి క్రేజ్ ఉండడం ఈ సినిమాకు మరింత క్రేజ్  పెరిగే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణ విచ్చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఇన్ని విశేషాలను కలిగి ఉన్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సరైన విజయాలు లేక హీరోగా నిలదొక్కు కోలేకపోతున్న శిరీష్ కి ఇప్పుడు ఈ సినిమా ఎంతో ప్రాముఖ్యమైనది అని చెప్పాలి. వచ్చే నెలలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే చాలా మంది విమర్శకులు చెప్పేది ఏమిటంటే ఈ సినిమాలో రొమాన్స్ పాళ్లు కొంచెం ఎక్కువ అయినట్లుగా ఉందని వారు చెబుతున్నారు. అంతేకాదు గతంలో శిరీష్ ఈ విధంగా ఎప్పుడు చేయలేదని ఇప్పుడు చేయడం ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అని కూడా వారు చెబుతున్నారు. మరి ఈ సినిమా యొక్క ఫలితం తెలియాలి అంటే విడుదల వరకు ఆడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: