ఒకేసారి రెండు సినిమాలను ఇప్పటి హీరోలు చేయడం లేదనే చెప్పాలి. ఒక సినిమా పూర్తయిన తర్వాతనే ఇంకొక సినిమా జోలికి వెళ్లే ఈ రోజులలో ప్రభాస్ మాత్రం ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లను చేస్తూ ప్రేక్షకులను ఎక్కువ సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన ఓం రౌత్ దర్శకత్వంలో చేసిన ఆది పురుష్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతూ ఉండగా ఆ తర్వాత కొద్ది గ్యాప్ లోనే మరికొన్ని సినిమాలను విడుదల చేయడానికి ఆయన రంగం సిద్ధం చేశాడు.

ఈ నేపథ్యంలోనే ఏకంగా రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్లను ఒకేసారి చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించబోయే రాజా డీలక్స్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలైంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా కూడా ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క షూటింగ్ వేగంగా జరుగుతుంది అని చెబుతున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది అని తెలుస్తుంది 

ఈ నేపథ్యంలో అలా ఈ సినిమా యొక్క షెడ్యూల్ పూర్తయిందో లేదో వెంటనే సలార్ సినిమా యొక్క షెడ్యూల్ మొదలుపెట్టారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాలేకపోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రభాస్ కు ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి. ఆ విధంగా ఈ రెండు సినిమాల యొక్క షూటింగ్లను ఒకేసారి చేయడం వాటిని ఒకేసారి పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు సినిమాలు కొంతకాలం వ్యవధిలో ఉన్న ప్రేక్షకులు ముందుకు వస్తాయి అని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: