విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ఘనంగా నిర్మిస్తున్న సినిమా ఖుషి. సమంత కథానాయకగా నటిస్తూ ఉండగా ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు వాహబ్ సంగీతం అందిస్తూ ఉండడం విశేశం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఓ పాట వారిని ఎంతగానో అలరించగా ఇప్పుడు ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న అంచనాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి.

విజయ్ దేవరకొండ ఇటీవలే లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా తప్పకుండా భారీ విజయం అందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అందుకే విజయ్ దేవరకొండసినిమా పట్ల ఎలాంటి తొందర పాటు లేకుండా ఎంతో జాగ్రత్తగా దానిని చేస్తున్నాడని చెప్పాలి. ఫైనల్ గా విజయ్ దేవరకొండ వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఈ సినిమా యొక్క షూటింగ్ పెండింగ్లో ఉంది.

 అయితే ఈ సినిమా యొక్క షూటింగ్ నవంబర్ రెండవ వారంలో మొదలు కాబోతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అన్నట్లుగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. సమంతకు ఒంట్లో బాగా లేకపోవడం కారణంగానే ఈ సినిమా యొక్క షూటింగ్ ఎన్ని రోజులు ఆగిపోయిందట. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఈ విషయాన్ని ఖరారు చేసింది. డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంతటి ఆలస్యం కావడానికి కారణం ఆమె. అయితే తొందర్లోనే ఆ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమయ్యాను అని చెప్పడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోష పరుస్తుంది.  మరి ఈ చిత్రం మార్చిలో విడుదల చేసి విజయాన్ని అందుకుంటారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: