అదితి రావ్ హైదరీ శుక్రవారం నాడే తన 36వ పుట్టినరోజు జరుపుకుంది. అదితి స్పెషల్ డే సందర్భంగా ఆమె స్నేహితులు, అభిమానులు అలాగే అనేక మంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆమె మీద శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. నిజానికి అదితి మన హైదరాబాద్‌లోనే జన్మించింది. నిజానికి అదితి రావ్ హైదరీ హైదరాబాద్ రాజ కుటుంబంలో జన్మించింది. ఆమె ఒకటి కాదు రెండు రాచరిక కుటుంబాలకు వారసురాలు.

ఆమె తాత, సర్ అక్బర్ హైదరీ, హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా పనిచేశారు, అలాగే ఆమె తల్లి తండ్రులు రాజా రామేశ్వర్ రావు III వనపర్తి రాష్ట్రానికి పాలకుడుగా పనిచేశారు. అదితి భరతనాట్యం డాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది, అయితే ఆమె నిజానికి తన ఆరేళ్ల వయసులో సంప్రదాయ నృత్యాన్ని ప్రారంభించింది. అదితీ ప్రముఖ భరతనాట్య నర్తకి లీలా శాంసన్ శిష్యురాలు కాగా 2004లో, అదితి తన మొదటి నటన ప్రాజెక్ట్ లో ఆమె 19వ శతాబ్దానికి చెందిన ఆలయ నర్తకి దేవదాసిగా ప్రధాన పాత్ర పోషించింది.

నిజానికి ఇది ఆమె మొదటి ప్రాజెక్ట్, కానీ థియేటర్లలో విడుదలైన ఆమె మొదటి చిత్రం మాత్రం మలయాళ మూవీ 'ప్రజాపతి', ఇందులో ఆమె మమ్ముట్టితో కలిసి కనిపించింది. అదితి రావ్ హైదరీకి అమీర్ ఖాన్‌ మాజీ భార్యకు బంధువు, అదితి అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ కి కోడలు. అదితి 2007లో నటుడు సత్యదీప్ మిశ్రాను అదితి వివాహం చేసుకున్నా అది వర్కౌట్ కాకపోవడంతో విడిపోయింది. 2013లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సంబంధాన్ని అంగీకరించి ఇప్పుడు విడిపోయామని వెల్లడించింది.

అంతేకాక తను సినిమాల్లోకి రావడానికి ముందు చాలా అవమానాలు ఎదుర్కొన్నానని హీరోయిన్ అదితీరావు హైదరీ తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. భరత నాట్యంలో ప్రావీణ్యం సంపాదించాక దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చానని, వాటిని చూసి తమిళ దర్శకురాలు శారద నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారని అన్నారు. అయితే ఆ శృంగారం సినిమా విడుదల చాలా ఆలస్యమైందని ఈ సమయంలో. మా అమ్మ ముందు ఏడిస్తే బాధ పడుతుందని బాత్రూమ్లోకి వెళ్లి ఏడ్చేదాన్నని ఆమె కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: