మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ మూవీ తో దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం లో తేరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం యు వి క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నట్లు ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ,  శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ తర్వాత రామ్ చరణ్ ,  గౌతమ్ తిన్నానూరి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కబోతున్నట్లు , ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందిపోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.  ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ మరియు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ ఆగిపోయింది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరియు గౌతమ్ తిన్ననూరి మూవీ దాదాపు క్యాన్సిల్ అయినట్టే అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తో సినిమా క్యాన్సల్ కావడంతో గౌతమ్ తిన్ననూరి టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ తో ఒక భారీ యాక్షన్ మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ మూవీ కి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తేరక్కపోయే మూవీ ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: