ఇది వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ లో స్ట్రాటజీ తో ఆడిన కంటెస్టెంట్స్ ని చూసి ఉంటాము..ఫిజికల్ గా ఆడిన కంటెస్టెంట్స్ ని చూసి ఉంటాము..ఎమోషనల్ కనెక్ట్ తో ఆడిన కంటెస్టెంట్ ని చూసి ఉంటాము..కానీ మొట్టమొదటిసారి ఫేక్ ఎమోషన్స్ ని చూపించే కంటెస్టెంట్ ని ఈ సీజన్ 6 లోనే చూస్తున్నాము..ఆమె పేరే ఇనాయ సుల్తానా..'చేపల చెరువు' టాస్కులో రేవంత్ తో మాట్లాడుతూ 'సూర్య' టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఉండనివ్వను..అదే నా టార్గెట్ ని చెప్పిందట..

తానూ అనుకున్న విధంగానే తన గేమ్ స్ట్రాటజీ ని సూర్య మీద ప్రయోగించి అతని ఆట తీరుని దెబ్బ కొట్టి, చివరికి నామినేట్ చేసి ఇంటి నుండి పంపేసింది..ఈ కారణం చెప్పే ఈరోజు ఇంటి సభ్యులందరూ ఇనాయ సుల్తానని నామినేట్ చేసారు..ముఖ్యంగా ఆది రెడ్డి ఇనాయ సుల్తానా ని, ఆమె ఆడే ఫేక్ నాటకాలను బాగా ఎక్సపోజ్ చేసాడట ..అది నిజం కాబట్టి..తన కన్నింగ్ గేమ్ స్ట్రాటజీ బయటపడేలోపు ఇనాయ కాస్త ఫ్రస్ట్రేషన్ కి గురి అవుతుంది.

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి ఆ అనుభవాలు ఇనాయ తో ఎదురు అయ్యాయి అని..స్నేహం పేరుతో ఇంట్లో ఎంతో మందికి వెన్నుపోటు పొడిచిందని ఇంటి సభ్యులందరూ నామినేట్ చేసారు..వాళ్ళు ఆధారాలతో సహా చెప్తుండడం చూస్తుంటే ప్రేక్షకులకు కూడా ఇనాయ సుల్తానా ఫేక్ కంటెస్టెంట్ గానే అనిపిస్తుందట...తాను చెయ్యాల్సింది అంతా చేసిన తర్వాత సూర్య ఎలిమినేట్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్తుంటే అతని మీద తెగ ప్రేమ ఉన్నట్టు ఏడ్చి బాగా నాటకాలు ఆడవు అంటూ ఇంటి సభ్యులందరూ ఇనాయ ని తప్పుబట్టారట..


ఇక శ్రీహన్ పట్ల కూడా ఆమె అనేక కోణాల్లో టార్గెట్ చేసి..ఒక్కసారి మంచిగా..మరోసారి గొడవలు పడుతూ ఇలా అతని మైండ్ తో కూడా తెగ ఆడేసుకుంది ఇనాయ..అయితే బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ గెలవాలనే చూస్తాడు..న్యాయబద్దం గా ఆడాలని రూల్ కూడా ఎక్కడ కూడా లేదు..ఎవరికీ నచ్చిన పద్దతి లో వాళ్ళు ఆడుతూ..వాళ్ళని ఓడించడానికి వాళ్ళ మైండ్ ని ఏమార్చి వాళ్ళ గేమ్ ని దెబ్బతియ్యొచ్చు..ఇనాయ కూడా అదే చేస్తుంది..కానీ మన అందరికి సెంటిమెంట్స్ మరియు ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి ఇలాంటివి పట్టించుకుంటాము అంటూ విశ్లేషకులు కూడా అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: