మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఎక్కువగా యువ హీరోయిన్లనే ఎంచుకోవడం జరుగుతుంది. వాస్తవానికి సీనియర్ హీరోలలో ఈ రకమైన ఇబ్బంది ఎంతో ఉంటుంది. వారితో ఎవరు హీరోయిన్ గా ఎవరు నటించాలి అన్న కన్ఫ్యూషన్ దర్శక నిర్మాతలాలో కలుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమంలో ఉన్న చాలా మంది సీనియర్ హీరోలకు హీరోయిన్ ల కొరత ఏర్పడింది. కానీ రవితేజకు మాత్రం ఈ విధమైన ఇబ్బంది ఏం జరగకపోవడం కొంతమందిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.

ఇటీవల రవితేజ చేస్తున్న సినిమాలను పరిశీలిస్తే అందులో హీరోయిన్లుగా నటించేవారు దాదాపుగా యువ హీరోయిన్ లే ఉన్నారు. ఫేడ్ అవుట్ అయిపోయే హీరోయిన్ లను,  రీఎంట్రీ ఇచ్చే హీరోయిన్ల ను కాకుండా కొత్త హీరోయిన్లను తీసుకువచ్చి ఆయన సినిమాలను చేస్తున్నాడు. ఇప్పుడు డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోయే ధమాకా సినిమాలో ఒకే ఒక సినిమా చేసిన అనుభవం కలిగిన శ్రీ లీల ను హీరోయిన్ గా ఎంపిక చేసాడు. అంతకు ముందు కిలాడి సినిమాలో కూడా ఇద్దరూ యువ హీరోయిన్లను ఎంపిక చేశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఆ ముద్దుగుమ్మలు తమ అందచందాలతో సినిమాపై మంచి క్రేజ్ తీసుకు వస్తున్నారు.

అంతేకాదు రావణాసుర సినిమాలో ఏకంగా ఐదుగురు యువ హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ చేయబోతున్నాడు. సినిమా పరిశ్రమంలో కొద్దిగా పేరు ఉన్న హీరోయిన్లను తీసుకువచ్చి వారికి మంచి సినిమా అవకాశాలను కల్పిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ వంటి హీరోయిన్లను ఈ సినిమాలో నటింపజేస్తూ ఉండడం విశేషం. ఇక టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కూడా యువ హీరోయిన్లతో ఆయన రొమాన్స్ చేయబోతున్నాడు. ఆ విధంగా ఎవరికి సాధ్యం కానీ ఈ పని రవితేజకే సాధ్యం అవుతూ ఉండడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపరుస్తుంది. ఇక డిసెంబర్ 23వ తేదీన ధమాకా తో ఆయన విజయం అందుకోవడం తప్పకుండా జరుగుతుంది అని కొంతమంది జోష్యం చెబుతున్నారు. ఆయన నటించిన గత రెండు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: