అల్లు అరవింద్ తనయుడిగా తెలుగు సినిమా పరిశ్రమ లోకి హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఇప్పుడు తనపై ఉన్న మెగా ముద్రను తొలగించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని తాజాగా ఏర్పడుతున్న పరిస్థితులను బ ట్టి చెప్ప వచ్చు. వాస్తవానికి అల్లు అర్జున్ మెగా హీరో గానే తెలుగు పరిచయం అయ్యాడు. మొన్నటి మొన్నటిదాకా అల్లు అర్జున్ మెగా హీరోల జాబితాలోనే చూసేవారు కానీ ఎప్పుడైతే తనకు తా నుగా ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టాడు అల్లు అర్జున్ అప్పటినుంచి మెగా హీరో ముద్రను తొలగించుకోగలుగుతున్నాడని చెప్పాలి.

ఈ మిషన్ను ఎప్పుడో ప్రారంభించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ ము ద్ర నుంచి దాదాపుగా బయటపడుతున్నాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. తన ప్రతి ఆడియో ఫంక్షన్ లో మెగా హీరోలను పిలవడం జరిగింది కానీ అది గతంలో ఇప్పుడు మె గా హీరోలను కాకుండా ఇతర హీరోల సినిమాలకు వెళ్లేందుకు, వారిని ఆహ్వానించేందుకు ఆయన ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూ డాలి. అల్లు అర్జున్ అభిమానులు చాలామంది మెగా అభిమానులు అయి ఉంటారు అన్న ఆపోహం నుంచి ఇప్పుడు బయటికి రావాలనే చెప్పాలి.

తనకంటూ సొంత ఆర్మీ ని ఏర్పరచుకొని అల్లు అర్జున్ టాలీవుడ్ లో నే అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు దానికి తోడు మెగా హీరోలు అల్లు వారి కార్యక్రమాలలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇతర హీరోలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. తాజా గా అల్లు శిరీష్ సినిమాకు ముఖ్యఅతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేయడం జరిగింది గత కొన్ని రోజులుగా ఆయనతో మంచి ర్యాపో ఏర్పరచుకున్నారు అల్లు వారు. ఈ నేప థ్యంలో వీరు  మె గా ముద్రను పోగొట్టు కోవడానికి చేస్తున్న ప్రయత్నాలు దేనికి ఎలాంటి పరిస్థితులను తీసుకువస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: