ఇండస్ట్రీ టాప్ దర్శకుడుగా ఒక వెలుగు వెలిగిన పూరీజగన్నాథ్ కెరియర్ అతడు ఎప్పుడు ఊహించని స్థాయిలో సమస్యలలో చిక్కుకుంది. ఎందరో టాప్ హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన పూరీ పరిస్థితి చూసి చాలామంది సానుభూతి చూపెడుతున్నారు. వాస్తవానికి పూరీ కూడ ‘లైగర్’ మూవీ ఆస్థాయిలో భారీ ఫ్లాప్ గా మారుతుందని ఊహించి ఉండడు.


ఈమూవీకి ఇచ్చిన విపరీతమైన పబ్లిసిటీ అదేవిధంగా ఈమూవీ కథ విషయంలో ఏమాత్రం శ్రద్ధను కనపరచక పోవడం ‘లైగర్’ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణాలుగా పేర్కొనాలి. ఈమూవీకి విడుదలకు ముందు ఏర్పడిన భారీ క్రేజ్ తో విపరీతమైన రేట్లకు ఈమూవీని అమ్మడంతో తీవ్రంగా నష్టపోయిన బయ్యర్లు నష్ట పరిహారం కోసం పూరీ పై ఒత్తిడి పెంచడమే కాకుండా పోలీసు కేసుల వరకు వెళ్ళే ఆలోచనలు చేయడంతో పూరీ చాల భావోద్వేగానికి లోనయ్యాడు.


‘తాను ఎవరినీ మోసం చేయలేదని కేవలం తనను నమ్మి టికెట్లు కొన్న ఆడియన్స్ కి మాత్రమే బాధ్యత వహిస్తానని’ పూరి జగన్నాధ్ విడుదల చేసిన ఒక నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఆ నోట్ కు మూవీ బయ్యర్లు మరింత అసహనానికి గురి కావడంతో పూరీ ‘లైగర్’ బయ్యర్ల వివాదం మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సున్నితమైన విషయం పై రంగంలోకి దిగిన ఇండస్ట్రీ పెద్దలు పూరీని అదేవిధంగా ఈమూవీ బయ్యర్లను తమ వద్దకు పిలిపించుకుని ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సంకేతాలు వస్తున్నాయి.


అవసరం అనుకుంటే ఈవిషయమై చిరంజీవి సలహాలను కూడ తీసుకుని ఈవిషయాన్ని సామరస్యంగా పరిష్కరించాలని ఇండస్ట్రీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే ఈవిషయంలో చిరంజీవి నిజంగా పూరీకి సహాయం చేయగలిగితే అతడు ఈ కష్టాలనుండి గట్టెక్కినట్లే అంటున్నారు. ఈపరిస్థితులు ఇలా ఉంటే పూరీజగన్నాథ్ ఒక కథను చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని తయారుచేసాడని అయితే చిరంజీవి పూరీని నమ్మి అవకాశం ఇస్తాడా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..






మరింత సమాచారం తెలుసుకోండి: