టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాలలో ఎదిగిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇస్తూ మంచి విజయాన్ని అందుకుంటూ ఉన్నారు. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మలయాళం చిత్రం లూసిఫర్ సినిమాకి రీమిక్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు.

ఇందులో సత్యదేవ్, నయనతార ,సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటించారు. అంతేకాకుండా చాలాకాలం తర్వాత చిరంజీవి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న చిత్రంలో నటించడంతో ఈ సినిమా ఆడియన్స్ ను కూడా బాగా మెప్పించింది. ఇక ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో రన్ టైం ముగించుకొని ఓటీటి లో కూడా సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటి సమస్త నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది అంతేకాకుండా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


మెగాస్టార్ కెరియర్ లోనే డీసెంట్ హిట్గా నిలిచిన ఈ సినిమా నవంబర్ 19 నుంచి ఓటిటిలో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది . దీంతో మెగా అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ చిత్రానికి సంగీతాన్ని తమ అందించారు. ఇక చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య, తదితర చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటూ ఉంటోంది. ఇక ఇటీవల విడుదలైన వాల్తేర్ వీరయ్య టైటిల్ వీడియో కూడా రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఇందులో శృతిహాసన్ కూడా హీరోయిన్గా నటిస్తూ ఉన్నది. రవితేజ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: