రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కెరియర్ లో 15వ సినిమా గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించారు. శంకర్ లాంటి అగ్ర దర్శకుడు తో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఆయన తెలుగులో తొలి సారి చేస్తున్న ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే ఖర్చు పెడుతున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉండగా వచ్చే ఏడాది వేసవిలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు .

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. రామ్ చరణ్సినిమా ద్వార  అంతకు మించిన ఇమేజ్ ను దేశవ్యాప్తంగా అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తరువాత ఆయన చేయబోయే సినిమాలకు సంబంధించిన దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటికే గౌతమ్ తిననురి చెప్పిన కథను మెచ్చిన రామ్ చరణ్ ఆ చిత్రాన్ని పలు కారణాలవల్ల క్యాన్సల్ చేశాడు . 

దాంతో ఇప్పుడు మరొక దర్శకుడు తో సినిమా చేసే విధంగా ఆయన ఆలోచనలు చేస్తున్నాడట. అయితే కొంతమంది దర్శకులు చరణ్ తో సినిమాలు చేయడానికి వెనకాడుతున్నట్లుగా తెలుస్తుంది. దానికి కారణం చరణ్ సినిమా చేస్తే ఆ సినిమా ను ఓకే చేయటానికి చాలా రోజులు సమయం పడుతుందని ఒకవేళ సినిమా ఓకే అయినా కూడా అది మొదలయ్యేంత వరకు ఆన్లో ఉంటుందో లేదో అన్న అనుమానం వారిలో నెలకొంటుందట. అందుకే చరణ్ తో సినిమా చేయడానికి కొంతమంది యువ దర్శకులు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఏ మాత్రం ఆలోచించకుండా సినిమాలను ఓకే చేస్తాడు కాబట్టి ఇప్పటికైతే చరణ్ కేవలం అగ్ర దర్శకులతో సినిమా చేయాలని వారు చెబుతున్నారు. త్వరలోనే ఆయన చేయబోయే తదుపరి సినిమాకు సంబంధించి ప్రకటన రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: