దర్శకుడు అనుదీప్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..ఇక  పిట్టగోడ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ దర్శకుడు..ఇక జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలిసారి క్యాష్‌ ద్వారా అనుదీప్‌లోని కామెడీ యాంగిల్‌ అందరికి తెలిసింది.తాజాగా శివ కార్తీకేయన్‌తో ప్రిన్స్‌ సినిమా తీశాడు.ఇక  ఈ సినిమా జాతి రత్నాలు సినిమా అంత పెద్ద విజయం సాధించలేదు. అయితే తెలుగులో హిట్‌ టాక్‌ తెచ్చుకోగా.. తమిళ్‌లో మాత్రం పెద్దగా రాణించలేదు. కాగా ఈ క్రమంలో తాజాగా సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రేమ అనుదీప్‌ని ఇంటర్వ్యూని చేసింది.

ఇక ప్రేమతో ఇంటర్వ్యూ సందర్భంగా అనుదీప్‌ తనకున్న ఓ వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు.అయితే  తనకు హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే డిజార్డర్‌ ఉందని చెప్పుకొచ్చాడు.కాగా  ప్రతి ఒక్కరిలో ఈ డిజార్డర్‌ లక్షణాలుంటాయి కానీ అర్ధం చేసుకోలేరని తెలిపాడు.ఇకపోతే  తన శరీరంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో తాను ఈ వ్యాధి గురించి తెలుసుకున్నాను అన్నాడు.కాగా  తనకు గ్లూటెన్‌ పడదని.. కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర రాదని.. ఏదైనా పళ్ల రసం తాగితే మైండ్‌ కామ్‌ అవుతుందని తెలిపాడు.ఇక  ఈ డిజార్డర్‌ ఉన్న వారి సెన్సెస్‌ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయని..

ఎక్కువ కాంతి వంతమైన లైట్లు చూసినా, ఘాటైన వాసనలు చూసినా తట్టుకోలేరని.. ఈ వ్యాధి ఉన్నవారు.. చాలా త్వరగా అలసిపోతారని చెప్పుకొచ్చాడు.దీని గురించి శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదని.. దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పాడు అనుదీప్‌.  ఈ వ్యాధి ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి పరిశోధించి.. ప్రస్తుతం అవే పాటిస్తున్నాను అని చెప్పాడు.అయితే  భవిష్యత్తులో హెచ్‌ఎస్‌పీ గురించి సినిమా తీసే ఆలోచన ఉందని.. దాని వల్ల కొందరైనా హీల్‌ అవుతారని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు అనుదీప్‌. ఇక దీంతో పాటు తన పర్సనల్‌ లైఫ్‌, తన అలవాట్లు వంటి వాటి గురించి ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చాడు అనుదీప్‌. అయితే ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరలవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: