మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటు వంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత నాగార్జున హీరోగా రమ్య కృష్ణ హీరోయిన్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన మూవీ తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో అనసూయ కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ తన అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఆ తరువాత ఈ ముద్దు గుమ్మ అనేక మూవీ లలో , అనేక పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే అనసూయ పోయిన సంవత్సరం పుష్ప ది రైస్ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా అనసూయ కు పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ప్రస్తుతం యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో నటిస్తూ వస్తున్న అనసూయ సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా అనసూయ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా అనసూయ తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో బ్లాక్ అండ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని , పింక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి , అదిరిపోయే డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: