కొంతమంది దర్శకులకు ఎలాంటి దురదృష్టం కలుగుతుంది అంటే వారికి హిట్స్ వచ్చినా కూడా తదుపరి సినిమా ను చేయడంలో ఎంతో ఆలస్యం చేస్తూ ఉంటారు. పలు కారణాల వల్ల వారు ఈ విధమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ విధంగా టాలీవుడ్ లో ఇద్దరు దర్శకులను దురదృష్టం వెంటాడుతుందో చెప్పవచ్చు. వారి సినిమాలు సూపర్ హిట్. పెద్ద హీరోలు కూడా వారితో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. అయినా వారు తమ సినిమాలను మొదలు పెట్ట లేకపోతున్నారు. అలా దురదృష్టం వారితో ఆటాడుకుంటుంది.

ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు దర్శకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పెన సినిమా తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు తదుపరి సినిమా ను ఎన్టీఆర్ తో చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అయితే ఈ సినిమా ఒకే అయ్యి చాలా రోజులే అవుతున్నా కూడా పట్టాలెక్కకపోవడం నిజంగా అందరిని నిరాశపరుస్తుంది. ముఖ్యంగా బుచ్చిబాబు అభిమానులను అసహన పరుస్తుంది. ఇదిగో అదిగో అంటూ ఈ సినిమా మొదలవబోతుంది అన్నట్లు ఈ సినిమా యొక్క కబురు చెబుతున్నారు కానీ అది మొదలవడం లేదు. అయితే చివరికి ఈ కథను ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడని త్వరలోనే రామ్ చరణ్ ను కలిసి ఈ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. 

మరి ఆ హీరో తో అయిన బుచ్చి బాబు సినిమా ను ఒకే చేసుకుని దాన్ని మొదలు పెడతాడా అనేది చూడాలి. ఇక పోతే మరో యువ దర్శకుడికి సైతం ఇప్పుడు ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది. జెర్సీ సినిమా తో సంచలన విజయం అందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ తో అయన సినిమా చేయబోతున్నాడు అని చెబుతున్నారు. అయితే ఆ చిత్రాన్ని క్యాన్సల్ చేయడం తో ఆ కథ ను మరో హీరో విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు. మరి ఈ దర్శకుడు ఈ సినిమా ను అయినా త్వర గా మొదలుపెట్ట మరో హిట్ ను అందుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: