‘కుక్క పిల్ల సబ్బు బిళ్ళ’ ఏ విషయం పై అయినా కవిత్వం వ్రాయవచ్చు మహాకవి శ్రీశ్రీ చెపితే బాత్రూమ్ లో కూడ లవ్ ప్రోపోజల్ ఇవ్వవచ్చు అని విజయ్ దేవరకొండ ఇప్పుడు చెపుతున్నాడు. అభిరుచులు ఫ్యాషన్స్ మారిపోవడంతో ఇప్పుడు బాత్రూమ్ లను కూడ చాల అందంగా తీర్చి దిద్దుతున్నారు.


ముఖ్యంగా బాత్రూమ్ ఆహ్లాదంగా ఉంటే కాలకుర్చాలు అన్నీ సక్రమంగా జరిగి ఆతరువాత మన దైనందిన రొటీన్ విషయాలలో శ్రద్ధగా సమర్థవంతంగా పనిచేయగాలుగుతారు అని అనేక పరిశోధనలు చెపుతున్నాయి. దానిలో భాగంగానే వచ్చింది గ్రీన్ బాత్రూమ్ కాన్సెప్ట్. పచ్చదనంతో ఉండే ఇండోర్ ప్లాంట్స్ ను ఇప్పుడు బాత్రూమ్ లలో కూడ కొందరు పెట్టుకుంటున్నారు.


శానిటరీ ప్రొడక్ట్స్ ను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న ఒక ప్రముఖ కంపెనీ యాడ్ లో విజయ్ దేవరకొండ కియారా అద్వానీ లు కలిసి నటించారు. ఈ యాడ్ లో విజయ్ కియారా కు బాత్రూమ్ లో లవ్ ప్రోపోజల్ చేస్తున్నట్లుగా ఈ యాడ్ లో డిఫరెంట్ గా చిత్రీకరించారు. త్వరలో ఈ యాడ్ అన్ని ప్రముఖ ఛానల్స్ లో ప్రచారం కాబోతోంది.

‘లైగర్’ సూపర్ ఫ్లాప్ గా మారినా విజయ్ దేవరకొండ మ్యానియా ఏమాత్రం తగ్గక పోవడంతో అతడికి బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ఏమాత్రం తగ్గలేదు.


దీనితో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు విజయ్ తో యాడ్స్ తీయడానికి ముందుకు వస్తూ భారీ పారితోషికాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం ‘లైగర్’ పరాజయం తరువాత విజయ్ తాను ఎంచుకునే కథల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తో విజయ్ చేస్తున్న ‘ఖుషీ’ కి బ్రేక్ వచ్చిన నేపధ్యంలో ఈ బ్రేక్ లో అనేకమంది యంగ్ డైరెక్టర్స్ చెపుతున్న అనేక కథలను విజయ్ వింటున్నప్పటికీ ఏ కథకు ఓకె చెప్పకుండా మరొకసారి పరాజయం అన్న పదం వినకూడదు అన్న ఉద్దేశ్యంతో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: