ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటికి చెక్ పెడుతూ వారిద్దరూ కలిసిపోవడం వల్ల వారి మధ్య ఏం గొడవ లేదు అని తేలిపోయింది.ఇదిలావుంటే తాజాగా అల్లు అర్జున్ తన అభిమానులు హర్ట్ అయ్యే ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇక అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఎంత అందంగా ఉంటుందో మనకు తెలిసిందే..అయితే ఆమె ఓ స్టార్ హీరోయిన్ కి ఉన్న అందంతో హీరోయిన్ లలాగే ఎప్పటికప్పుడు అందమైన

 ఫోటో షూట్స్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువగా స్నేహ రెడ్డి ఫోటో షూట్స్ పై ఆసక్తి కనబరుస్తోంది.ఇక  తన స్టైలిష్ లుక్కుతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఈ నేపథ్యంలోనే స్నేహ రెడ్డి మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ తో ఓ సినిమా చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇక  దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయని త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారట. అయితే ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇకపోతే అల్లు అర్జున్ కూడా తన భార్యను హీరోయిన్గా చేయడానికి

 ఒప్పుకున్నాడని నీ హద్దుల్లో నువ్వు ఉంటూ హీరోయిన్గా నటించమని స్నేహ రెడ్డికి ఫుల్ రైట్స్ ఇచ్చేసారట.ఈ నేపద్యంలోనే స్నేహ రెడ్డి కూడా హోంలీ లేడి రోల్స్ చేయడానికి సిద్ధపడి దర్శకులకు కూడా చెప్పిందని వార్తలు వస్తున్నాయి. అయితే  ఇక స్నేహ రెడ్డి హీరోయిన్ అవడం తన మామ అల్లు అరవింద్ కి అస్సలు ఇష్టం లేదట.  అల్లు అర్జున్ మాత్రం తన భార్య కోరికను కాదనలేక హీరోయిన్ గా చేయమని చెప్పారట.అయితే  ఇక ఈ నేపద్యంలోనే అల్లు అరవింద్ కి అల్లు అర్జున్ కి మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగిందని వీరి మధ్యలో ఇప్పుడు మాటలు లేవని తెలుస్తోంది . అయితే మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే అల్లు ఫ్యామిలీ నోరు విప్పాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: