పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే పోయిన సంవత్సరం వకీల్ సాబ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా వరస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ యూనిట్ అదిరిపోయే యాక్షన్స్ సన్నివేషాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ యాక్షన్ సన్నివేశాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే గడ్డం లుక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గడ్డంతో అదిరిపోయే లుక్ లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్న యాక్షన్ సన్నివేశాలలో వందలాది మంది ఆర్టిస్ట్ లు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: