కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  అజిత్ ఆఖరుగా వలిమై అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. వలిమై మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా ,  కార్తికేయ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందింది. కొంత కాలం క్రితమే వలిమై మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు ,  హిందీ ,  మలయాళ , కన్నడ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి తమిళ్ భాషలో అద్భుతమైన కలెక్షన్ లు లభించినప్పటికీ ఇతర భాషలలో భారీ కలెక్షన్ లభించలేదు.

కాకపోతే ఈ మూవీ లో దర్శకుడు బైక్ చేజింగ్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానానికి మాత్రం ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి ఈ మూవీ దర్శకుడు కి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ "తూనివూ" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను కూడా అజిత్ పూర్తి చేశాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టెంట వైరల్ అవుతుంది. ఈ మూవీ లో అజిత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని పోస్టర్ లను మూవీ యూనిట్ ఇప్పటికే విడుదల చేయగా తూనివూ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: