సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కలిసి తెరకెక్కించిన చిత్రం లైగర్. ఈ చిత్రంలో హీరోయిన్గా అనన్య పాండే నటించినది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. దీంతో విజయ్ దేవరకొండ పరిస్థితి చాలా దిగజారిపోయింది అనే వార్తలు కూడా వినిపించాయి. కేవలం గీతాగోవిందం, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా పెళ్లిచూపులు సినిమాలు తప్ప విజయ్ దేవరకొండ కెరియర్ లో అన్ని ఫ్లాప్లే మిగిలాయి. అందుచేతనే ఈ హీరోతో సినిమా చేయాలి అంటే ఎంతమంది దర్శకనిర్మాతలు భయపడుతున్నారు.

వాస్తవానికి విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం మూడు సంవత్సరాలు తన సమయాన్ని కేటాయించడమే కాకుండా తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్న ఈ సినిమా ఫలితం మాత్రం వేరే లాగా వచ్చిందని చెప్పవచ్చు. అప్పటినుంచి మీడియాకు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నాడు విజయ్ దేవరకొండ. అయితే బెంగళూరులో జరిగిన సైమా అవార్డు ఫంక్షన్లు లైగర్ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడడం జరిగింది. తాజాగా ఒక తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ లైగర్ సినిమా ప్లాప్ గురించి మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

విజయ్ మాట్లాడుతూ.. లైగర్ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్నారు. నా లైఫ్ లో ఎలాంటి మార్పులకు కారణమయ్యింది అనే అంశాల పైన కూడా స్పందించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని.. ఈ సినిమా ప్రాసెస్ ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేశానని కానీ ఫలితం మాత్రం దక్కలేకపోయిందని నిరాశగా తెలియజేశారు విజయ్ దేవరకొండ. కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటాము తప్పులు చేయడం లేదంటే మన జీవితంలో దేనికోసం గట్టిగా ట్రై చేయలేదని అర్థమని కంఫర్ట్ జోన్ లో ఎంత చేసిన అందులో పని ఉండదని తెలియజేశారు. గొప్ప పనులు చేయాలని కోరిక ఉండాలి కొన్నిసార్లు మనం ప్రయత్నం ఫలించకపోవచ్చు కానీ ఆ ప్రయత్నం చేయడం ముఖ్యమని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: