పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి , కేవలం రాజకీయాల మాత్రమే ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా ఇప్పటికే తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ ,  భీమ్లా నాయక్ అనే రెండు మూవీ లలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకొని ,  భారీ కలక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించాయి.

ఇలా రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన రెండు మూవీ లు అద్భుతమైన విజయాలు సాధించడంతో ,  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఏం ఏం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రోజు నుండి ఈ మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి ఆచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాష లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: