హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్సినిమా చేయవలసి ఉండగా అది మధ్యలోనే ఆగిపోయింది అన్న విషయం తెలిసిందే. చాలా రోజుల ఎదురు చూపుల తర్వాత హరిష్ శంకర్ ఈ సినిమాను ఆపేసి మరొక హీరోతో సినిమా చేయడానికి వెళ్ళాడు ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి సినిమాను విజయ్ దేవరకొండ తో చేయడానికి సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు రాశారు.

ఫైనల్ గా వీరిద్దరి కాంబో సెట్ అవ్వడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని తెలుస్తుంది. ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసిన హరీష్ శంకర్ తొందరలోనే విజయ్ దేవరకొండకు వినిపించి ఓకే చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ కనుక ఆ సినిమాకు ఓకే చేస్తే తప్పకుండా ఇది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖుషి అనే సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ చిత్రం తర్వాత ఏ దర్శకుడు తో సినిమా చేయడానికి కూడా కమిట్ అవలేదు.

ఈ నేపథ్యంలోనే ఈ దర్శకుడుతో సినిమా చేసేందుకు ఆయన ఎక్కువగా ఆలోచనలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలు ఒకేసారి చేసే ఆలోచనలు కూడా చేస్తున్నాడు. అన్ని కుదిరితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు త్వరలోనే రాబోతున్నాయి. మరి ఈ సినిమాలలో విజయ్ దేవరకొండ ఏ సినిమా ఒకే చేస్తాడో చూడాలి. ప్రస్తుతం అయన ఖుషి సినిమా షూటింగ్ లో నే ఉన్నాడు. ఈ చిత్రం ను వేసవి లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. హరీష్ శంకర్ కి ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్ విజయ్ దేవరకొండ నే. 

మరింత సమాచారం తెలుసుకోండి: