ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో ప్రేక్షకుల బుర్రకు పదును పెట్టే కథలకు డిమాండ్ పెరిగింది. ఈనాటితరం ప్రేక్షకులు ఎరగని 1980 కాలంనాటి పరిస్థితులతో తీసిన సినిమాలు కొన్ని హిట్ అయిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే ట్రెండ్ ను కొనసాగిస్తే ప్రేక్షకులు సినిమాలు చూడరని దర్శకులు కొత్త కథల కోసం చేస్తున్న అన్వేషణలో భాగంగా యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి 2050 ప్రాంతాలలో జరిగే ఒక ఫ్యూచరిస్టిక్ కథను వ్రాసుకున్నాడట.


ఈకథను సినిమాగా తీయాలి అంటే సుమారు 200 కోట్లు బడ్జెట్ అవుతుందని అంచనాతో గౌతమ్ తిన్ననూరి ఈ కథను రామ్ చరణ్ కు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. మొదట్లో ఈకథ పై చరణ్ ఆశక్తి కనపరిచినా  ఆతరువాత చిరంజీవి సలహాతో ఈ కథను వదులుకున్నట్లు తెలుస్తోంది. దీనితో గౌతమ్ తిన్ననూరి ఈ కథను విజయ్ దేవరకొండకు వినిపిస్తే అతడు ఆ కథకు ఓకె చెప్పినప్పటికీ ఈమూవీని నిర్మించవలసి ఉన్న దిల్ రాజ్ అంత భారీ బడ్జెట్ ఈ కథ పై పెట్టడానికి ఆశక్తి కనపరచకపోవడంతో ప్రస్తుతానికి ఈ కథ అటకెక్కింది అంటున్నారు.


దీనితో తాను కష్టపడి వ్రాసుకున్న కథను నమ్మి పెట్టుబడి పెట్టగల నిర్మాత గురించి గౌతమ్ తిన్ననూరి అన్వేషణ కొనసాగిస్తున్నట్లు టాక్. ఈ రాయబారాలు ఇలా కొనసాగుతూ ఉండగానే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకుని గౌతమ్ వ్రాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక కథను చెప్పి హీరోలను ఒప్పించడం చాల కష్టంగా మారిన పరిస్థితులలో మంచి కథలు వ్రాయగల దర్శకులు కూడ ఇబ్బంది పడుతూ హీరోలు ఎలాంటి కథను చెపితే ఒప్పుకుంటారో తెలియక తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.


ఇప్పుడు ఆ లిస్టులోకి గౌతమ్ తిన్ననూరి కూడ చేరిపోవడంతో కథలు వ్రాయడం వాటితో హీరోలను ఆపై ప్రేక్షకులను మెప్పించడం ఎంత కష్టమైన పనిగా మారిందో ఎవరికైనా అర్థం అవుతుంది. మరి రానున్న రోజుఅలలో గౌతమ్ తిన్ననూరి కి సపోర్ట్ ఇచ్చే హీరోలు ఎవరో తేలిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: