టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో హీరోగా నటించి , ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నిఖిల్ తాజాగా కార్తికేయ 2 అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా , మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

శ్రీనివాస్ రెడ్డి ,  వైవా హర్ష ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి దేశవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి. దానితో కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే బుల్లి తెర పేక్షకులను అల్లరించడానికి రెడీ అయింది.

మూవీ హిందీ వర్షన్ సాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. జి సంస్థ ఈ సినిమా హిందీ వర్షన్ ను జీ సినిమాలో నవంబర్ 27, 2022 న రాత్రి 8 గంటలకు ప్రసారం చేయనుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను కూడా జీ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ ను  కూడా నవంబర్ 27, 2022 న రాత్రి 8 గంటలకు ప్రసారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: