సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజినీ కాంత్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ "జైలర్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  రమ్యకృష్ణ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ,  మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ ir మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే జైలర్ మూవీ నుండి రజనీ కాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేయగా , ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ 170 వ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. రజినీ కాంత్ తన 170 సినిమాలో హీరోగా కాకుండా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు.

రజనీ కాంత్ "లాల్ సలాం" అనే మూవీ లో కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీ లో విష్ణు విశాల్ , విక్రాంత్ సంతోష్ లు హీరో లుగా కనిపించబోతున్నారు. ఐశ్వర్య రజనీ కాంత్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఏ ఆర్ రెహమాన్ మూవీకి సంగీతం అందించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: