వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న ప్రభాస్ పరిస్థితిని చూసి అతడి అభిమానులు తీవ్రంగా కలతచెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్ ను చూసి అభిమానులు మరింత గందరగోళంలోకి వెళ్ళిపోయారు. దీనికితోడు ఈ టీజర్ ను చూసిన చాలామంది చిన్నపిల్లల కార్టూన్ సినిమాలా ఉంది అని కామెంట్స్ చేయడం ప్రభాస్ అభిమానులను మరింత కృంగతీసింది.


ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈ మూవీ నిర్మాతలు సంక్రాంతికి విడుదల కావలసి ఉన్న ‘ఆదిపురుష్’ మూవీ రిలీజ్ ను వచ్చే ఏడాది జూన్ కు మార్చడం వెనుక పెద్ద వ్యూహమే నడిచింది అని అంటున్నారు. ఈ మూవీలోని గ్రాఫిక్ వర్క్స్ క్వాలిటీ ఏమాత్రం బాగాలేదు అని విపరీతమైన విమర్శలు రావడంతో ఇప్పుడు ఈ గ్రాఫిక్ వర్క్స్ ను చక్కదిద్దే బాధ్యత అమెరికా కెనడాలలోని రెండు ప్రముఖ గ్రాఫిక్ వర్క్స్ కంపెనీలకు అప్పచెప్పినట్లు టాక్.


ఇలా మళ్ళీ ఈసినిమాకు సంబంధించిన రీ గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్న నేపధ్యంలో ఈ మూవీ నిర్మాతలకు అదనంగా మరొక 100 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రాజెక్ట్ పై 4వందల కోట్లు ఖర్చు అయిన పరిస్థితులలో మరొక 100 కోట్లు అదనంగా ఈ మూవీ ప్రాజెక్ట్ పై ఖర్చు పెట్టడం ఒక విధంగా సాహసమే అనుకోవాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


అయితే ఈమూవీని ప్రపంచంలోని 24 భాషలలో డబ్ చేసి ఒకేసారి విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ పై పెట్టిన భారీ ఖర్చు అంతా కేవలం మొదటివారం కలక్షన్స్ లోనే వచ్చేస్తుందని ఈమూవీ నిర్మాతల నమ్మకం అని అంటున్నారు. ఇప్పుడు ‘ఆదిపురుష్’ జూన్ లో విడుదల అవుతున్న పరిస్థితులలో ప్రభాస్ నటిస్తున్న మరొక సినిమా ‘సలార్’ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో కాకుండా వచ్చే సంవత్సరం చివరిలో కానీ లేదంటే 2024 సంక్రాంతికి విడుదల వాయిదా పడే ఆస్కారం ఉందని ఇప్పుడు సరికొత్త ప్రచారం మొదలైంది..



మరింత సమాచారం తెలుసుకోండి: