లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో హీరో విజయ్ దేవరకొండ ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఎంతో కష్టపడి ఈ చిత్రంలో నటించగా నిరాశ మిగిల్చడంతో కాస్త నిరుత్సాహ చెందాడు విజయ్ దేవరకొండ.ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఉంటాయని వెనుకడుగు వేయడానికి తాను ఇష్టపడనని ఎన్నోసార్లు తెలియజేశారు. లైగర్ విడుదల తర్వాత కొన్ని రోజులపాటు లో ప్రొఫైల్ ను మెయింటైన్ చేసిన విజయ్ దేవరకొండ మళ్లీ ఎప్పటిలాగానే యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తోంది. పబ్లిక్ ఈవెంట్లకు హాజరు అవ్వడమే కాకుండా తరచూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు.
ఇక ఇటీవల ట్రెండీ ఫోటో షూట్లను సైతం షేర్ చేసిన విజయ్ దేవరకొండ నిన్నటి రాత్రి ఒక ఆసక్తికరమైన పోస్టుని షేర్ చేయడం జరిగింది. ఆ పోస్టులో విజయ్ చేతికి పొక్కులు లేచిన తన చేతులతో ఉన్న ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. 8 నెలల పునరావాసం తర్వాత వెనుక భాగం దాదాపుగా స్థిరపడింది .బీస్ట్ బయటకు రావడానికి చనిపోతోంది అంటూ చాలా కాలంలో ఉంచబడింది. ప్రతి ఒక్కరు కష్టపడి అధిగమించండి అంటూ విజయ్ దేవరకొండ రాసుకురావడం జరిగింది.

వాస్తవానికి లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా జిమ్ములో కఠినమైన వర్క్ అవుట్ లు చేసి సిక్స్ ప్యాక్ బాడీని చేసుకోవడమే.. కాకుండా తన పాత్రకు తగ్గట్టుగా మార్షల్ ఆర్ట్స్ బాక్సర్ గా పర్ఫెక్ట్ ఫిజిక్ తో అందరిని ఆకట్టుకున్నారు. అయితే వర్కౌట్ సమయంలో విజయ్ వీపుకు గాయమయ్యిందట.అయితే ఇప్పుడు దాని నుండి కోలుకోవడానికి మళ్లీ హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా ఒక పోస్ట్ ని షేర్ చేయడంతో ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారుతోంది.లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: