ఈ సంవత్సరం మొదట్లో బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి నుండి వచ్చిన చిత్రం "ది కాశ్మిరీ ఫైల్స్". కరోనా అనంతరం వచ్చిన ఈ సినిమాపై అస్సలు ఎవరికీ అంచనాలు లేవు. కానీ విడుదలైన మొదటి షో నుండి దీనికి వచ్చిన స్పందన దేశం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కూడా డిమాండ్ లు వినిపించాయి. కానీ ఎలాగోలా సినిమా ప్రదర్శితం అయ్యి సంచలనం సృష్టించింది. ఒక చిన్న సినిమాగా వచ్చి భారీగా కలెక్షన్ లను సాధించి సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పాపులర్ డైరెక్టర్ గా మారిపోయాడు.

ఈయన ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విధానం... ఆ సమయంలో కాశ్మిర్ లో జరిగిన ఘోరాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన విధానానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అప్పటి నుండి వివేక్ నుండి వచ్చే ప్రాజెక్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఒక అధికారిక ప్రకటన ద్వారా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించి మరో సంచలనానికి తెరతీశాడు. తాజాగా వివేక్ తన సీఎంగా టైటిల్ పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడని తెలిపారు. కాగా ఈ సినిమాను కరోనా నేపథ్యంలో తెరకెక్కించనున్నాడు. సినిమా టైటిల్ ను "ది వాక్సిన్ వార్" గా నామకరణం చేశారు.

గత మూడు సంవత్సరాల క్రితం మన దేశాన్ని కంటికి కనిపించని ఒక వైరస్ ఏ విధంగా మన జీవితాలను మరియు జీవన విధానాలను పూర్తిగా మార్చేసిందో తెలిసిందే. ఈ కరోనా వైరస్ కారణంగా ఎందరో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ కరోనా వైరస్ కు విరుగుడుగా వచ్చిన వాక్సిన్ గురించి తీస్తున్న సినిమాగా దీనిని చెపుకోవచ్చు. ఇందులో ఏ విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అన్నది మాత్రం దర్శకుడు వివేక్ కు మాత్రమే తెలియాలి. అయితే కాశ్మిరీ ఫైల్స్ సినిమా లాగా ఇది ఏమైనా వివాదాస్పదం అవుతుందో చూడాలి. ఈ సినిమా గురించి తెలిసిన మరికొంతమంది సినీ ప్రముఖులు మరియు విశ్లేషకులు ఇది వివేక్ అగ్నిహోత్రి చేస్తున్న సాహసోపేత నిర్ణయమా  అంటూ కామెంట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: