మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. రవితేజ ఈ సంవత్సరం మొదట ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించగా , ఆ తర్వాత రామారావు అన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యాయి. కాకపోతే ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాయి. ఇలా ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఈ సంవత్సరం మూడో మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

రవితేజ ఈ సంవత్సరం ధమాకా మూవీ తో మరో సారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు  ఇది ఇలా ఉంటే ధమాకా మూవీ కి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి బీమ్స్ సిసిరోలిఓ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి "వాట్ హప్పనింగ్" అనే సాంగ్ ప్రోమో ను విడుదల చేసింది.

అలాగే ఈ ఫుల్ సాంగ్ ను రేపు అనగా నవంబర్ 11 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ధమాకా మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. మూవీ యూనిట్ ధమాకా చిత్రం నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూ వీపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: