బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు రసవత్తరంగా మారింది..ఒక్కొ వారం బయటకు వచ్చిన వాళ్ళు తమకు నచ్చిన విధంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు..కాగా గత వారం జరిగిన ఎలెమినేషన్ రౌండ్ లో గీతూ ని ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ లో గెలిచిన,ఎలిమినేట్ అయినా సరే ఇంటర్వ్యూలు, పార్టీలు అంటూ కొంచెం హడావిడి చేస్తారు. కానీ గీతు ఎలిమినేట్ అయిన తర్వాత చాలా సైలెంట్ గా ఉండిపోయింది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకా గీతు ఎలిమినేషన్ బాధ నుంచి బయటకు వచ్చినట్లు కనిపించట్లేదు. ఇక ఇప్పుడు గీతూ ఏడుస్తూ పోస్ట్ చేసిన ఒక వీడియో దీనికి ఉదాహరణ అని చెప్పవచ్చు.అయితే గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ అంతా ఇంట్రెస్టింగ్ గా లేదని చెప్పాలి.


అయినా సరే ప్రేక్షకులు ఈ సీజన్ ను వీక్షిస్తున్నారు అంటే దానికి కారణం గీతూ .మొదటి ఎపిసోడ్ నుంచే ఫుల్ ఎనర్జీతో అందర్నీ డామినేట్ చేసింది. ఇక గీతూ ని చూసి మిగతా హౌస్ సభ్యులు కూడా భయపడిపోయేవారు. అలా మొదటి ఎపిసోడ్ నుంచి తన చివరి ఎపిసోడ్ వరకు గీతు ఆడిందే ఆటగా జరిగింది .అయితే దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. బహుశా గీతూ ఆ లిమిట్ ను క్రాస్ చేసిందేమో. అందుకే బిగ్ బాస్ గీతూ ను ఎలిమినేట్ చేసి ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ముందు కూడా నన్ను పంపించొద్దు అని గీతూ ఏడ్చిన తీరు చూసి ప్రతి ఒక్కరూ బాధపడ్డారు..
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది



గీతూ..బిగ్ బాస్ ప్రయాణంలో తాను నేర్చుకున్న గుణపాటాలను తాను బయటకు రావడానికి గల కారణాలను చెబుతూ గంట దాకా మాట్లాడింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నన్ను ప్రమోట్ చేయమని చెప్పి కొందరికి 25000 డబ్బులు ఇచ్చానని కాని వారు నన్ను మోసం చేశారని, నా గురించి ఒక్క పాజిటివ్ కామెంట్స్ కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. నా అనుకున్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని ధైర్యంతో హౌస్ లోకి వెళ్ళానని కానీ ఏ ఒక్కరూ నాకు మద్దతు గా నిలవలేదని, ఈ విషయం నన్ను చాలా బాధ పెట్టిందంటూ చెప్పుకొచ్చింది. ఇంకా నా గేమ్ ను తప్పుపడుతున్నారు.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: