సుడిగాలి సుదీర్.. తెలుగు బుల్లితెరపై ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా తెలుగు బుల్లితెరపై స్టార్ హీరో రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో కమెడియన్ గా ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో దగ్గర అయ్యాడు. ముఖ్యంగా రష్మీ తో లవ్ ట్రాక్ కారణంగానే సుదీర్ బాగా పాపులారిటీ సంపాదించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా  కొనసాగుతున్న సమయంలోనే సుదీర్ అటు ఊహించని విధంగా ఈటీవీ నుంచి తప్పుకున్నాడు.  స్టార్ మా చానల్లో ప్రత్యక్షమై అక్కడ పలు కార్యక్రమాలు చేశాడు.


 కానీ ఏది సెట్ కాలేదు.. అయితే సుడిగాలి సుదీర్ ఇక జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన నాటి నుంచి కూడా అటు రేటింగ్స్ ఒక్కసారిగా పడిపోయాయి. కేవలం రష్మీ సుధీర్ లవ్ ట్రాక్ మీదే షో రేటింగ్ ఆధారపడి ఉండగా.. ఇక అదే లవ్ ట్రాక్ లేకపోవడంతో ఎంతోమంది జబర్దస్త్ చూడటం కూడా మానేశారు. ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ మరోసారి సందడి చేశాడు. తన పాత టీం మేట్స్ తో కలిపి ఒక స్కిట్ చేసిన సుధీర్ ఇక అటు బుల్లెట్ భాస్కర్ టీంలో కూడా మరో స్కిట్ తో అలరించాడు.



 సుడిగాలి సుదీర్ మళ్ళీ రావడంతో అట అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక మళ్లీ జబర్దస్త్ రేటింగ్స్ పొంగిపోవడం ఖాయమని బుల్లితెర ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. అయితే సుధీర్ తానంతట తానే వచ్చాడా లేకపోతే మల్లెమాల వాళ్లు బలవంతంగా అతన్ని బ్రతిమిలాడి తీసుకువచ్చారా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. సుధీర్ వెళ్లిపోయాక రేటింగ్స్ పడిపోవడంతో రేటింగ్స్ ఇక మళ్ళీ పుంజుకునేలా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు మల్లెమాల యాజమాన్యం. అయినప్పటికీ కుదరకపోవడంతో చివరికి సుదీర్ నే మళ్లీ తీసుకొచ్చారు అన్నది తెలుస్తుంది. పనిలో పనిగా సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ప్రమోషన్స్ కూడా చేసుకున్నాడు సుదీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: