ఒకప్పుడు బిగ్ బాస్ ను చూడాలని చాలా మంది ఆసక్తి చూపించే వాళ్లు కానీ ఇప్పుడు మాత్రం బోర్ కొడుతూందని   జనాలు ఎప్పటి నుంచో అంటున్నారు..ఇప్పుడు హౌస్ లో రచ్చలు ఎక్కువ అయ్యాయి..బిగ్‌బాస్‌ లో రెండు రోజులుగా కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఒకరికొకరు కొట్టుకొని, తోసుకొని, తిట్టుకొని, పోటీపడీ మరీ ఆడారు.ఈ పోటీలో చివరికి పోటీలో శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా మిగలగా థర్మోకోల్స్ బాల్స్ గేమ్ లో చివరికి ఫైమా గెలిచి ఈ వారం కెప్టెన్ గా ఎన్నికైంది.


ఈ టాస్క్ లో ఫైమా, ఆదిరెడ్డి కలిసి ఆడారని ఇనయా ఫైర్ అవ్వగా ఇనయా, ఆదిరెడ్డి మేధ్య గొడవ జరిగింది. ఆదిరెడ్డి ఏం చేస్కుంటావో చేసుకో, నువ్ అన్నదే నిజం అయితే బిగ్‌బాస్‌ వదిలి వెళ్ళిపోతాను అంటూ అరిచాడు. రేవంత్‌, రాజ్‌ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ శ్రీహాన్, శ్రీసత్య గురించి తప్పుగా మాట్లాడటంతో శ్రీహాన్ రెచ్చిపోయి రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు.ఆ తర్వాత కంటెస్టెంట్స్ వరస్ట్ పర్ఫార్మర్స్ కి రెడ్ స్టాంప్స్ వేశారు. ఈ వరస్ట్ పర్ఫార్మర్ ఎంపికలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అయ్యాయి. ఎక్కువమంది ఇనయాకి రెడ్ స్టాంప్ ఇవ్వగా ఇనయా అందరితో గొడవ పెట్టుకుంది.


ఇక శ్రీసత్య, రేవంత్ మధ్య కూడా గొడవ అయింది. సంచాలక్‌గా వరస్ట్ గా చేసావు అని కొంతమంది రేవంత్ కి వరస్ట్ పర్ఫార్మర్ ఇచ్చారు. ఎక్కువమంది ఇనయాకి ఇవ్వడంతో ఇనయా జైలుకి వెళ్ళింది. నేడు వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎవరి మీద ఫైర్ అవుతాడో చూడాలి.. ఈ సీజన్ లో గందరగోళంగా వుంటుంది.. ఈవారం ఇనయా బయటకు వస్తుందని టాక్ వినిపిస్తోంది..చివరకు బిగ్ బాస్ టైటిల్ ను ఎవరూ అందుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.ఏం జరుగుతుందో ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: